: తూర్పు గోదావరి జిల్లాలో అతిరుద్ర మహాయాగం
శివారాధనలో ఉత్కృష్టమైన అతిరుద్ర మహాయాగానికి నేడు శ్రీకారం చుడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం మురమళ్ళలో ఈ మహాయాగాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాదుకు చెందిన యజ్ఞకర్త, ప్రముఖ జ్యోతిష, వాస్తు శాస్త్ర నిపుణులు కేసాప్రగడ హరిహరనాథ శర్మ నేతృత్వంలో ఈ యాగం జరుగుతోంది. ఆమధ్య భద్రాచలంలో అతిరాత్రం యాగాన్ని నిర్వహించిన సమతా లోక్ సేవాసమితి ఇప్పుడు ఈ యాగాన్ని కూడా నిర్వహిస్తోంది.
పదకొండు రోజుల పాటు ఈ మహాయాగాన్ని నిర్వహిస్తామని శర్మ తెలిపారు. 1901లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ అతిరుద్రం నిర్వహించారనీ, మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అదే విధానంలో ఈ మహాయాగాన్ని తలపెట్టామనీ ఆయన చెప్పారు.యాగశాల చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసుకునేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.