MPP: అవసరమైతే కౌంటింగ్‌నే నెల రోజుల పాటు వాయిదా వేయండి: ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ల ఎన్నికలపై ఉత్తమ్

  • 27న ఫలితాలొస్తే జులై 5న ఎన్నికా?
  • ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది
  • నర్సారెడ్డి దీక్ష విరమింపజేస్తాం

మే 27న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలొస్తే, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ల ఎన్నికను జూలై 5 తరువాత చేస్తారా? అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి మండిపడ్డారు. నేడు గాంధీ భవన్‌లో డీసీసీల సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ల ఎన్నికకు చాలా ఎక్కువ సమయం ఉండటంతో ప్రలోభాలకు గురి చేసే అవకాశముందని కాబట్టి దీనికి వ్యతిరేకంగా తాము ఈసీని కలుస్తామన్నారు.

ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ల ఎన్నికకు అంత ఎక్కువ సమయం తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే, కౌంటింగ్‌నే నెల రోజులపాటు వాయిదా వేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. తాము యశోదా ఆసుపత్రికి వెళ్లి నర్సారెడ్డి దీక్షను విరమింపజేస్తామన్నారు. 23న కౌంటింగ్‌కు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సమావేశంలో ముఖ్యంగా చర్చించినట్టు ఉత్తమ్ తెలిపారు.

More Telugu News