Chandrababu: చంద్రబాబు నివాసం వద్ద అరటి తోటల్లోకి దూసుకెళ్లి బోల్తాపడిన కారు
- అమరావతి నుంచి ఉండవల్లి వెళుతున్న కారు
- అదుపుతప్పిన వైనం
- ముగ్గురికి గాయాలు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాసం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి నుంచి ఉండవల్లి వెళుతున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న అరటి తోటల్లోకి దూసుకెళ్లి ఆపై బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇతర వాహనాలు ఆగిపోవడంతో అక్కడ కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.