: ముంబయిలో మెరిసిన 'తారే'


రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఓపెనర్ ఆదిత్య తారే (37 బంతుల్లో 59; 8 ఫోర్లు,1 సిక్స్) హాఫ్ సెంచరీతో అలరించాడు. సచిన్ గైర్హాజరీలో జట్టులోకొచ్చిన తారే టాప్ స్కోరర్ గా నిలిచాడు. వేలంలో కోట్లుపోసి కొనుక్కున్న ఖరీదైన ఆటగాడు మాక్స్ వెల్ 23 పరుగులు చేయగా, దినేశ్ కార్తీక్ 21, పొలార్డ్ 17 పరుగులు చేశారు. దీంతో, నిర్ణీత ఓవర్లలో ముంబయి జట్టు 8 వికెట్లకు 166 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లు ఫాక్ నర్, వాట్సన్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం వేదిక.

  • Loading...

More Telugu News