Chandrababu: మీకు ఫైబర్ నెట్ ఉంటే విద్యార్థి నంబర్ టైపు చేయండి... టీవీ తెరపై రిజల్ట్స్ వస్తాయి: చంద్రబాబు

  • మంగళవారం విడుదల కానున్న టెన్త్ ఫలితాలు
  • ఆర్టీజీఎస్ సైట్లోనూ చూసుకోవచ్చన్న చంద్రబాబు
  • పలు యాప్ లింకులు తన ట్వీట్ లో పొందుపరిచిన వైనం

ఆంధ్రప్రదేశ్ లో రేపు పదో తరగతి పరీక్ష ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ను 14వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ విడుదల చేస్తుందని ట్వీట్ చేశారు. ఈ ఫలితాలను విద్యార్థులు rtgs.ap.gov.in వెబ్ సైట్ ద్వారా, లేదా, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్, ఖైజాలా యాప్ ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఈసారి ప్రత్యేకంగా టెలివిజన్ తెరలపైనా పదో తరగతి పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చని చంద్రబాబు వివరించారు. ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్నవాళ్లు తమ సెట్ టాప్ బాక్స్ ద్వారా విద్యార్థి హాల్ టికెట్ నంబర్ టైపు చేస్తే టీవీ తెరపై పరీక్షల ఫలితాలు ప్రత్యక్షమవుతాయని తెలిపారు. ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తన ట్వీట్ లో వెల్లడించారు.

  • Loading...

More Telugu News