Rohit Chowdary: కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన రక్షణ శాఖ.. 2016కు ముందు మెరుపుదాడుల దాఖలాలు లేవని వెల్లడి

  • మెరుపు దాడుల సమాచారాన్ని కోరిన రోహిత్
  • 2018లో ఆర్టీఐకి దరఖాస్తు
  • కాంగ్రెస్ ప్రచారానికి విరుద్ధంగా సమాధానం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీల మధ్య మెరుపు దాడుల విషయమై విమర్శ, ప్రతివిమర్శలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా రక్షణ శాఖ షాక్ ఇచ్చింది. 2004 నుంచి 2014 మధ్య కాలంలో మెరుపు దాడులకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ జమ్ముకశ్మీర్‌కి చెందని రోహిత్ చౌదరి ఆర్టీఐని ఆశ్రయించారు.

రోహిత్ 2018లో ఈ దరఖాస్తు చేయగా తాజాగా ఆర్టీఐ సమాచారం అందించింది. అయితే ఈ సమాచారం కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారానికి విరుద్ధంగా వచ్చింది. తమ హయాంలో ఆరుసార్లు మెరుపు దాడులు చేశామని కాంగ్రెస్ చెబుతుండగా, 2016కు ముందు మెరుపు దాడులు జరిగినట్టు దాఖలాలేవీ లేవని రక్షిణ మంత్రిత్వ శాఖ రోహిత్‌కు వెల్లడించింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News