: కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేది హరీషే: ఎమ్మెల్సీ సుధాకర్
కలెక్షన్ కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ సుధాకర్ బాబు తీవ్రవ్యాఖ్యలు చేసారు. కేసీఆర్ బృందంతో తెలంగాణ వచ్చే అవకాశమే లేదని సుధాకర్ బాబు స్పష్టం చేసారు. కేసీఆర్ బృందం కలెక్షన్లు మరిగారని కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కలెక్షన్ కింగులేనని, అందుకు వారు కూడబెట్టిన బినామీ ఆస్తులే సాక్ష్యమని దుయ్యబట్టారు. కలెక్షన్లు నిజం కాకపోతే కేసీఆర్ కుటుంబసభ్యులంతా తమ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేసారు. ఎప్పటికైనా కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేది హరీష్ రావేనన్నారు.