Andhra Pradesh: చంద్రబాబును ఎల్వీ సుబ్రహ్మణ్యం కలవకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లా?: విజయసాయిరెడ్డి
- ఓటమి భయంతో బాబులో అసహనం పెరిగింది
- కోడ్ అమల్లో ఉంటే సీఎస్ ఎలా కలుస్తారు
- చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత ఆగ్రహం
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలియడంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందని విమర్శించారు. ‘ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పుడు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం చంద్రబాబును కలవకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లా? వాటీజ్ డెమొక్రసీ? ఎన్నికలంటే ఏమిటి? ఎవరో డబ్బు సమకూరుస్తారు. ఇంకొకరు ఖర్చుపెట్టి గెలుస్తారు’ అని మాట్లాడటమేంటి చంద్రబాబూ?’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.