AR Rehman: కెనడా పౌరసత్వాన్ని వినమ్రంగా తిరస్కరించిన ఏఆర్ రెహమాన్
- నాకు తమిళనాడు చాలు
- భారత్ నా ఫ్యామిలీ
- అక్షయ్ కుమార్ ఉదంతం నేపథ్యంలో రెహమాన్ వైఖరికి అభిమానుల ఫిదా
ఇటీవల బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వం కలిగివున్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో అక్షయ్ కుమార్ పై విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే, ఇదే విషయంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రెండేళ్ల క్రితం రెహమాన్ సంగీత కచేరీ కోసం కెనడాలోని టొరంటో నగరానికి వెళ్లారు. అప్పటికే అక్కడి మేయర్ రెహమాన్ ప్రతిభాపాటవాల గురించి విని ఉన్నారు.
ఆయన రెహమాన్ కు కెనడా పౌరసత్వాన్ని ఇవ్వజూపారు. కానీ, రెహమాన్ ఎంతో మర్యాదగా ఆయన ఆఫర్ ను తిరస్కరించారు. తాను తమిళనాడులో ఎంతో సంతోషంగా ఉన్నానని, భారతదేశం తనకు కుటుంబం లాంటిదని ఆ మేయర్ తో చెప్పారు. అయితే, కెనడా దేశీయులు మాత్రం రెహమాన్ పై గౌరవంతో ఒంటారియో నగరంలో ఓ వీధికి ఆయన పేరు పెట్టుకున్నారు. తాజాగా, అక్షయ్ కుమార్ వ్యవహారం నేపథ్యంలో రెహమాన్ స్పందన మరోసారి తెరపైకి వచ్చింది.