Andhra Pradesh: అభివృద్ధి పనులను అందరూ పట్టించుకుంటే విజయం ఒకవైపే ఉంటుంది: సీఎం చంద్రబాబు
- అలా జరగడానికి కొంచెం సమయం పడుతుంది
- నివేదికలు, సర్వేలు, టీడీపీకు అనుకూలంగా ఉన్నాయి
- పథకాలు మా విజయానికి కీలకం కానున్నాయి
నివేదికలు, సర్వేలు, టీడీపీకు అనుకూలంగా ఉన్నాయని, సంక్షేమ పథకాలు తమ విజయానికి కీలకం కానున్నాయని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో ప్రజావేదికలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ‘మైండ్ గేమ్’ ఆడుతున్నాయని విమర్శించారు. ఏపీని ఇంత అభివృద్ధి చేశాక ఓటు వేయకపోతే రాజకీయాలకు అర్థం లేదని, అభివృద్ధి పనులను అందరూ పట్టించుకుంటే విజయం ఒక వైపే ఉంటుందని, అలా జరగడానికి కొంచెం సమయం పడుతుందని అన్నారు. తాత్కాలిక ప్రలోభాలకు ఆశ పడితే శాశ్వత అభివృద్ధి ఉండదని చెప్పారు.