Andhra Pradesh: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం.. 12 మంది ఏపీ ఉద్యోగులపై ఈసీ కఠిన చర్యలు
- నిర్లక్ష్యం చూపారంటూ సస్పెన్షన్ వేటు
- ఇప్పటివరకు 12 మంది ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు
- శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశం
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల సంఘం వ్యవహారసరళిపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఎన్నికల సంఘం మరోసారి తన మార్కు చూపించింది. ఇప్పటివరకు 12 మంది ఏపీ ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకుంది. ఎన్నికల విధుల్లో క్రమశిక్షణ రాహిత్యంతో వ్యవహరించారంటూ తాజాగా విశాఖ, కోవూరు, మండపేట, నూజివీడు, సూళ్లూరుపేట ఆర్వో, ఏఆర్వోలపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. కాగా, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఇటీవలే ఈసీ చర్యలు తీసుకుంది. సస్పెండైన అధికారులపై శాఖాపరమైన విచారణ జరపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.