shicvakrishna: ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను .. ఎక్కువ డబ్బులు సంపాదించలేకపోయాను: నటుడు శివకృష్ణ

  • తొలి సినిమానే సూపర్ హిట్ అయింది
  •  16 సినిమాలు వదులుకున్నాను
  •  నా సినిమాలు 125కి మించలేదు  

శివకృష్ణ పేరు వినగానే విప్లవ భావాలు కలిగిన సినిమాలు గుర్తొస్తాయి. అవినీతి .. అక్రమాలపై ఉద్యమించే కథానాయకుడు కళ్లముందు కదలాడతాడు. తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఘనత శివకృష్ణ సొంతం. అలాంటి శివకృష్ణ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తొలినాళ్లలో తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు.

"నా తొలి సినిమా 'మరో మలుపు' .. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత చేసిన 'ఈ చరిత్ర ఏ సిరాతో' .. 'ఇదికాదు ముగింపు' కూడా విజయాలను సాధించాయి. తొలి సినిమా చేసిన తరువాత 16 సినిమాల్లో అవకాశం వచ్చింది. కానీ నాకు నచ్చకపోవడం వలన చేయలేదు. మూడు సినిమాలు హిట్ అయిన తరువాత కమర్షియల్ సినిమాల వైపు వెళ్లాను. పెద్ద నిర్మాతలకి కాకుండా చిన్న నిర్మాతలకి డేట్స్ ఇచ్చేవాడిని. నాకు వచ్చిన అవకాశాలకు నేను 300 సినిమాల వరకూ చేయాలి .. కానీ 125కి మించలేదు. నా భావాల కారణంగా నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను .. ఎక్కువ డబ్బు సంపాదించలేకపోయాను" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News