India: ముగిసిన నాలుగో విడత పోలింగ్... 9 రాష్ట్రాల్లో ఓటింగ్

  • ఇప్పటివరకు నాలుగు విడతల్లో 373 స్థానాలకు ఎన్నికలు
  • మే 6న ఐదో విడత ఎన్నికలు
  • 51 స్థానాల్లో పోలింగ్

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ ముగిసింది. 9 రాష్ట్రాల్లోని 72 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ నిర్వహించారు. దాంతో ఇప్పటివరకు నాలుగు దశల్లో 373 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరిపినట్టయింది. మరో మూడు విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. తదుపరి దశ మే 6వ తేదీన నిర్వహిస్తారు. ఐదో విడతలో భాగంగా 51 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

కాగా, సాయంత్రం 5 గంటల సమయానికి వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఓటింగ్ శాతం ఇలా ఉంది...

  • బీహార్-44.33
  • ఝార్ఖండ్-57.13
  • ఉత్తరప్రదేశ్-53.23
  • ఒడిశా-53.61
  • మహారాష్ట్ర-42.52
  • మధ్యప్రదేశ్-57.77
  • రాజస్థాన్-54.75
  • పశ్చిమ బెంగాల్-66.46
  • జమ్మూకశ్మీర్-9.37

  • Loading...

More Telugu News