Telangana: ధర్నాకు వెళ్లనివ్వరని తెలిసి పోలీసులను తెలివిగా ఏమార్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్

  • పోలీసుల కళ్లుగప్పి ట్యాక్సీలో పయనం
  • ఆలస్యంగా గుర్తించిన పోలీసులు
  • అప్పటికే ధర్నా మొదలుపెట్టేసిన లక్ష్మణ్

తెలంగాణలో ఇంటర్ మార్కుల వ్యవహారం తీవ్రస్థాయిలో రగులుతోంది. దీనిపై అన్ని వర్గాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ తెలంగాణ విభాగం కూడా దీనిపై కేసీఆర్ సర్కారును గట్టిగా నిలదీస్తోంది. ఈ క్రమంలో సోమవారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేయాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిర్ణయించుకున్నారు. దాంతో, ఆయనను ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు భావించారు. ఈ ఉదయం నుంచే ముషీరాబాద్ లో ఉన్న లక్ష్మణ్ క్యాంప్ ఆఫీసు ముందు భారీ సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు.

పోలీసుల రాకను ముందే ఊహించిన లక్ష్మణ్ ఎంతో తెలివిగా తన వాహనాన్ని అక్కడే ఉంచేసి, ఓ క్యాబ్ మాట్లాడుకుని దాంట్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిపోయారు.  పోలీసులు గుర్తించేసరికి ఆయన అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆలస్యం చేయకుండా బీజేపీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన దీక్షా వేదిక వద్దకు చేరుకుని నిరశన మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News