: కొత్త మిత్రుల అన్వేషణలో కాంగ్రెస్ పెద్దలు


కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త మిత్రులు కావాలి. లోక్ సభకు మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో, అందుకు ఊతమిచ్చేలా కాంగ్రెస్ పార్టీ మిత్రుల కోసం వెతుకుతోంది. అలాగే, త్వరలో తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న తరుణంలో కూడా కొత్త స్నేహాల కోసం కాంగ్రెస్ పార్టీ దృష్టి పెడుతోంది. మూడోసారి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రావడం కోసం ఇప్పటి నుంచే పార్టీ కసరత్తు మొదలెట్టింది.

తమతో కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకోవడం కోసం కాంగ్రెస్ పెద్దలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొత్త పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోవడం కోసం రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఓ కమిటీ కూడా పని చేస్తోంది. మరోపక్క పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై దృష్టి పెట్టి, పార్టీ ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News