ntr: ఎన్టీఆర్ ను ఆరాధించే పాత్రలో నిత్య!

  • చరణ్ జోడిగా అలియా భట్
  • వచ్చేనెలలో తాజా షెడ్యూల్ 
  • గిరిజన యువతిగా నిత్యామీనన్

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ .. చరణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో పది రోజుల్లో ఈ సినిమా షూటింగు మొదలు కానుంది. చరణ్ జోడీగా అలియా భట్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన నాయిక ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం నిత్యామీనన్ తీసుకున్నారనే టాక్ బలంగా వినిపించింది. దాంతో ఈ సినిమాలో ఆమె పోషించనున్న పాత్ర ఏమిటనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ప్రేమించే గిరిజన యువతిగా నిత్యామీనన్ కనిపిస్తుందనేది తాజా సమాచారం. ఈ పాత్ర అన్నివర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అంటున్నారు. నిత్యామీనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటేనే ఆ పాత్రలో విషయం ఉందని అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఒక వైవిధ్యభరితమైన పాత్ర ద్వారా 'ఆర్ ఆర్ ఆర్'కి నిత్యామీనన్ కొత్త అందాన్ని తీసుకురానుందన్న మాట. 

More Telugu News