Jagan: బొత్స ఇంట పెళ్లికి హాజరైన జగన్... "సీఎం, సీఎం" అనే నినాదాలతో మార్మోగిన పెళ్లివేదిక

  • బొత్స సోదరుడు అప్పలనరసయ్య కుమార్తె పెళ్లి
  • రుషికొండ సాయిప్రియా రిసార్ట్స్ లో ఘనంగా వివాహం
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబంలో జరిగిన ఓ పెళ్లికి హాజరయ్యారు. బొత్స సోదరుడు అప్పలనరసయ్య కుమార్తె యామిని వివాహం విశాఖపట్నంకు చెందిన రవితేజతో నేడు రుషికొండ సాయిప్రియా రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి విచ్చేసిన జగన్ నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా, జగన్ రాకతో అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది.

"సీఎం, సీఎం" అంటూ నినాదాలతో పెళ్లివేదికను హోరెత్తించారు. ఓ దశలో పెళ్లిమంత్రాలు, మంగళవాయిద్యాల హోరును మించిపోయి నినాదాలు చేశారు. అభిమానుల సందడి చూసి జగన్ కూడా ఎంతో ముచ్చటపడ్డారు. పెళ్లివేదిక వద్ద ఉన్నంతసేపు జగన్ మోము వెలిగిపోయింది. నవ్వుతూ, తుళ్లుతూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. కాగా, ఈ పెళ్లికి జగన్ తో పాటు పార్టీ అగ్రనేతలు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News