Telangana: విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభ పెట్టిన ఆ ఏజెన్సీపై కఠిన చర్యలు తీసుకుంటాం: జనార్దన్ రెడ్డి

  • ఫలితాల్లో ఒకటికి మించిన పొరబాట్లు దొర్లాయి
  • బాధ్యులైన అధికారులపై చర్యలు ఉంటాయి
  • త్రిసభ్య కమిటీ నివేదికపై మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ కార్యదర్శి

ఇంటర్ మార్కుల వ్యవహారంలో త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఒకటికి మించిన పొరబాట్లు దొర్లాయని, ఈ కారణంగానే మార్కుల్లో గందరగోళం చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఈ పొరబాట్లకు కారణమైన అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయని అన్నారు.

కాగా, ఇంటర్ మార్కుల డేటా ప్రాసెసింగ్ కోసం సర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్న ఆ ఏజెన్సీకి ఇంకా డబ్బులు చెల్లించలేదని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను దారుణమైన రీతిలో బాధపెట్టినందుకు ఆ ఏజెన్సీపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇంటర్ మార్కుల డేటా ప్రాసెసింగ్ చేస్తున్న సంస్థకు సమాంతరంగా మరో సంస్థతో డేటా ప్రాసెసింగ్ చేయించాలన్నది కమిటీ సిఫారసుల్లో ముఖ్యమైనదని జనార్దన్ రెడ్డి తెలిపారు. అయితే, ఆ రెండు సంస్థల డేటా నూటికి నూరు శాతం కచ్చితమని సరిచూసుకున్న తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని కమిటీ సూచించినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News