Telangana: ఫలితాలు పబ్లిష్ చేయడంలో తప్పులు దొర్లాయి... ప్రాక్టికల్స్ మార్కులే కనిపించలేదు: తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి

  • త్రిసభ్య కమిటీ నివేదికలో అంశాలపై మాట్లాడిన జనార్దన్ రెడ్డి 
  • కొందరు చివరి నిమిషంలో పరీక్షాకేంద్రం మార్పుతో నష్టపోయారు
  • గ్లోబరినా సాఫ్ట్ వేర్ లోపాలు ఉన్నట్టు కమిటీ గుర్తించింది

తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికలో ఉన్న అంశాలపై ఆయన మాట్లాడారు. ఇంటర్ మార్కులు పబ్లిష్ చేయడంలో తప్పులు దొర్లాయని కమిటీ గుర్తించినట్టు తెలిపారు. ఆశ్చర్యకరమైన రీతిలో 531 కేసుల్లో ప్రాక్టికల్స్ మార్కులు విద్యార్థుల మెమోల్లో కనిపించలేదని వెల్లడించారు. అయితే వాళ్ల రిజల్ట్ చూస్తే 'పాస్' అని ఉందని తెలిపారు.

మీడియా వాళ్లకు ఇచ్చిన ఫలితాల సీడీకి, ఇంటర్ బోర్డు వద్ద ఉన్న ఫలితాల సీడీకి తేడా ఉందని జనార్దన్ రెడ్డి చెప్పారు. ఆ పొరబాటును గుర్తించినా, ఇంటర్ బోర్డు అధికారులు దాన్ని సరిదిద్దడంలో సరిగ్గా వ్యవహరించలేదన్న విషయాన్ని కూడా త్రిసభ్య కమిటీ తప్పుబట్టిందని అన్నారు. కొందరు విద్యార్థులు చివరి నిమిషంలో ఎగ్జామ్ సెంటర్ మార్పు వల్ల నష్టపోయారని ఆయన వివరించారు.

అంతేగాకుండా, ఓ స్టూడెంట్ కు 99 మార్కులు రావడంపైనా విద్యాశాఖ కార్యదర్శి వివరణ ఇచ్చారు. ఆ స్టూడెంట్ కు మొదట 99 కి బదులు 00 అని ముద్రించారని, అయితే తమ దృష్టికి రావడంతో వెరిఫై చేసి 99 అని నిర్ధారించామని చెప్పారు. అంతేగాకుండా, గ్లోబరినా సంస్థ ఉపయోగించిన సాఫ్ట్ వేర్ లో లోపాలు ఉన్నట్టు కమిటీ పరిశీలనలో తేలిందని అన్నారు.

  • Loading...

More Telugu News