Salman Khan: అభిమానిపై సల్లూ భాయ్ కి కోపం వచ్చింది!

  • బాంద్రా ఏరియాలో సల్మాన్ సైక్లింగ్
  • వీడియో చిత్రీకరించే ప్రయత్నం చేసిన అభిమాని
  • ఫోన్ లాగేసుకున్న సల్మాన్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ అభిమాని పట్ల ఆగ్రహం ప్రదర్శించారు. తన అనుమతి లేకుండా తనను వీడియోలో చిత్రీకరించడం సల్మాన్ కోపానికి కారణమైంది. సల్మాన్ ఆ అభిమాని నుంచి ఫోన్ లాగేసుకున్నారు. దీనిపై డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఇవాళ ఉదయం సల్మాన్ వ్యాయామంలో భాగంగా ముంబయిలోని బాంద్రాలో సైక్లింగ్ చేస్తుండగా, ఓ అభిమాని తన ఫోన్ తో వీడియో తీయడం మొదలుపెట్టాడు.

ఈ విషయం గమనించిన సల్మాన్ వెంటనే ఆ వ్యక్తి నుంచి ఫోన్ తీసేసుకున్నారు. దాంతో, ఆ అభిమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను సల్మాన్ అంగరక్షకుల నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నానని ఆ అభిమాని స్పష్టం చేస్తుండగా, మరోవైపు సల్మాన్ అంగరక్షకులు ఆ అభిమానిపైనే కేసు పెట్టారు. పర్మిషన్ తీసుకోకుండా వీడియో తీయడం సల్మాన్ కు నచ్చలేదని బాడీగార్డులు తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆ అభిమానికి డీఎన్ నగర్ పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

More Telugu News