Andhra Pradesh: స్ట్రాంగ్ రూమ్ ల భద్రతపై సందేహాలు వద్దు: సీఈవో ద్వివేది

  • ఈవీఎంలుంచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదు
  • అక్కడ మూడంచెల భద్రత ఉంది
  • చిత్తూరు జిల్లాలో వచ్చిన వదంతులను నమ్మొద్దు

ఏపీలో స్ట్రాంగ్ రూమ్ ల భద్రతపై సందేహాలు వద్దని, ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది వివరణ ఇచ్చారు. ఈవీఎంలు భద్రపరిచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రత ఉందని అన్నారు. పార్టీలు తమ ఏజెంట్లను స్ట్రాంగ్ రూమ్ కంట్రోల్ రూమ్ ల్లో ఉంచవచ్చని సూచించారు. ఈవీఎంలు భద్రపరిచిన చోట్ల ఇంటర్నెట్ సౌకర్యం ఉండదని, అపోహలకు తావివ్వకుండా ఉండేలా భద్రత కల్పించామని, వైఫై ద్వారా ఈవీఎంలను నియంత్రిస్తారనే ప్రచారం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. చిత్తూరు జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్ లపై వచ్చినవి వదంతులు మాత్రమేనని, వదంతులు ప్రచారం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

More Telugu News