: నవాజ్ షరీఫ్ కు ఒబామా అభినందనలు
పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన నవాజ్ షరీఫ్ కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్లో అభినందనలు తెలిపారు. చరిత్రాత్మక ఎన్నికల్లో నవాజ్ పార్టీ విజయం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేస్తోందన్న ఒబామా, పౌరప్రభుత్వం ఏర్పాటుకు సహకరించిన పాకిస్థాన్ ప్రజలకు అభినందనలు తెలిపారు.