Telangana: తెలంగాణలో 49 మంది అధికారులకు ప్రమోషన్లు.. ఈసీ అనుమతి

  • ఎన్నికల సంఘం ప్రత్యేక అనుమతి
  • 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లకు పదోన్నతి
  • 15 జీవోలు జారీచేసిన టి-సర్కారు

ఓవైపు ఎన్నికల నియమావళిపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలోనే తెలంగాణ సర్కారు ఏకంగా 49 మంది ఉన్నతాధికారులకు పదోన్నతి కల్పించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈసీ అనుమతితో తెలంగాణ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. పదోన్నతి పొందినవారిలో 26 మంది ఐఏఎస్ లు, 23 మంది ఐపీఎస్ అధికారులున్నారు. ఇందుకోసం టి-సర్కారు 15 జీవోలు జారీచేసింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారులకు కూడా ఈ సందర్భంగా ప్రమోషన్ ఇచ్చారు.

  • Loading...

More Telugu News