Jana Sena: ఎన్నికల తర్వాత జనసేన ఉండదన్నారు... చూడండి ఏంజరుగుతుందో!: మాదాసు గంగాధరం

- ఎవరెవరో మొరుగుతున్నారు
- ప్రతిదానికీ స్పందించలేం
- జనసేనకు సైలెంట్ ఓటింగ్
జనసేన పార్టీ అగ్రనేత మాదాసు గంగాధరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల పరిణామాలపై స్పందించారు. ఎన్నికల తర్వాత జనసేన పార్టీ కనిపించదని కొందరు అంటున్నారని, కానీ, జనసేన సత్తా ఏంటో ఫలితాల రోజున తెలుస్తుందని అన్నారు. ఎవరో ఏదో మొరిగితే తాము ప్రతిదానికీ స్పందించలేమని స్పష్టం చేశారు. జనసేనకు సైలెంట్ ఓటింగ్ పడిందని, అది ఏ స్థాయిలో ఉంటుందనేది మే 23న వెల్లడవుతుందని మాదాసు వ్యాఖ్యానించారు.
ప్రజల తీర్పు వెలువరించాకే తాము అందరికీ జవాబు చెబుతామని, కానీ, ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రజలకు చేరువలో ఉండాలని తమ అధినేత పవన్ కల్యాణ్ సూచించారని వివరించారు. ఇతర పార్టీల్లా ఫలితాలపై తమకు ఎలాంటి ఆదుర్దా లేదని మాదాసు వ్యంగ్యం ప్రదర్శించారు.