Telangana: హైదరాబాద్ లో ఇంటర్ బోర్డు వద్ద తీవ్ర ఉద్రిక్తత

  • ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్ 
  • నిరసనకు దిగిన తల్లిదండ్రులు
  • కార్యాలయం ఎదుట బైఠాయింపు

తెలంగాణ ఇంటర్ ఫలితాల ప్రహసనం నేపథ్యంలో ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఇంటర్ బోర్డు కార్యదర్శిని కలవాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికార వర్గాలు అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ దశలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

  • Loading...

More Telugu News