: పదవి చేపట్టగానే సిబాల్ అవినీతికి పాల్పడ్డారు: కేజ్రీవాల్


సామాజిక కార్యకర్త, అవినీతిపై పోరాడుతున్న ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్ కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. న్యాయశాఖా మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టి 48 గంటలు కూడా గడవకముందే కపిల్ సిబాల్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వొడాఫోన్, హచిసన్ ట్యాక్స్ కేసును కోర్టు వెలుపల పరిష్కరించుకుంటామని మంత్రి చెప్పడం లాలూచీపడడమేనని కేజ్రీవాల్ అన్నారు. సిబాల్ కుమారుడు హచిసన్ కు న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారని, దాదాపు 12 వేల కోట్ల రూపాయల ట్యాక్స్ వొడాఫోన్, హచిసన్ ఎగ్గొట్టడానికి చూస్తుంటే మంత్రిగా ఈ విషయాన్ని కోర్టు బయట పరిష్కరించుకుంటామని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. అవినీతిలో కూరుకుపోయిన చిదంబరం, కపిల్ సిబాల్, సల్మాన్ ఖుర్షీద్ లను సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పించే కమిటీలో సభ్యులుగా నియమించడం హాస్యాస్పదం కాక మరేమిటని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News