Hyderabad: హైదరాబాద్ ఆసుపత్రిలో వింత శిశువు జననం
- శిశువుకు రెండు తలలు
- తల్లిగర్భంలోనే మృతిచెందిన వైనం
- ఐదవ నెలలో కాన్పు చేసిన వైద్యులు
హైదరాబాద్ నగరంలో వింత శిశువు జన్మించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని డంగోరియా ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ యువతికి కాన్పు చేసిన వైద్యులు రెండు తలల శిశువును చూసి విస్మయం చెందారు. మహేష్, సుజాత దంపతులు నగరంలోని ముషీరాబాద్ లో నివాసం ఉంటున్నారు. మహేష్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే, సుజాతకు ఐదు నెలల గర్భం నేపథ్యంలో పరీక్షలు చేసిన వైద్యులు ఆమె కడుపులో రెండు తలల శిశువు ఉన్నట్టు గుర్తించారు. తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సుజాతకు డెలివరీ చేసి వింత శిశువును బయటికి తీశారు.