: రఘునందన్ పై టీఆర్ఎస్ గరంగరం
టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్ రావుపై ఆ పార్టీ మెదక్ జిల్లా ఇన్ ఛార్జి రాజయ్య విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీలో పలు కీలక పదవులు కల్పించి, అందలం ఎక్కిస్తే, రఘునందన్ రావు ఉద్యమంలో పాల్గొనేందుకు ససేమిరా అన్నారని రాజయ్య ఆరోపించారు. పదవుల కోసమే పాకులాడారని, పార్టీ కోసం ఆయన చేసిందేమీలేదని రాజయ్య విమర్శించారు.