Chandrababu: పుకార్లను నమ్మవద్దని కర్నూలు జిల్లా నేతలకు స్పష్టం చేసిన చంద్రబాబునాయుడు
- హోటల్ హరితలో ప్రత్యేక సమావేశం
- 20 నిమిషాల పాటు చర్చ
- నేతలకు ధైర్యం చెప్పిన పార్టీ అధినేత
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్ణాటకలోని రాయ్ చూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లేముందు కర్నూలు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. కర్నూలు జిల్లాలోని రాతివనాలను సందర్శించిన చంద్రబాబు కర్నూలులోని హోటల్ హరితలో జిల్లా నేతలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో 20 నిమిషాల పాటు మాట్లాడారు. ఎన్నికల ఫలితాల విషయంలో బయటి నుంచి వస్తున్న పుకార్లను నమ్మవద్దని సూచించారు.
రాష్ట్రంలో అధికారం టీడీపీదేనని, భారీ మెజారిటీతో 120 స్థానాలకు పైగా గెలుస్తామని చెబుతూ నేతలు, కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు. మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది తామేనని, ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని నాయకులతో చెప్పారు.