Chandrababu: ఆయన జగన్ కేసుల్లో సహనిందితుడే కదా... రికార్డుల్లో ఉన్నదే చెప్పా!: చంద్రబాబు
- మాజీ ఐఏఎస్ లు గవర్నర్ ను కలవడంపై చంద్రబాబు స్పందన
- సొంత అజెండాలు పెట్టుకుని పనిచేయడం సరికాదు
- బదిలీలు జరుగుతుంటే ఎక్కడికెళ్లారు వీళ్లంతా?
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పోలింగ్ పరిణామాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన పోలవరం ప్రాజక్టు వివరాలు వెల్లడించి ఆపై పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై స్పందించారు. మాజీ ఐఏఎస్ లు గవర్నర్ ను కలవడంపై మాట్లాడుతూ, ఎలాంటి తప్పు చేయకుండానే పునేఠాను బదిలీ చేయడంపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
అదే సమయంలో ఒక ట్రైబల్ ఆఫీసర్ ను బదిలీ చేస్తే ఎందుకు మాట్లాడలేదు మీరు? అంటూ నిలదీశారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ముగ్గురు ఎస్పీలను బదిలీ చేస్తే ఏమైపోయారు మీరంతా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. వ్యక్తిగత అజెండా పెట్టుకుని వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.
తాను ఎల్వీ సుబ్రహ్మణ్యం విషయంలో సహనిందితుడు అని పేర్కొనడంలో తప్పేముందని అన్నారు. 'జగన్ కేసుల్లో ఆయన సహనిందితుడే కదా, అది రికార్డుల్లో ఉంది' అంటూ వ్యాఖ్యానించారు.