Chandrababu: చంద్రబాబును సెక్రటేరియేట్ కు వెళ్లకుండా చూడండి... వెళ్తే ఆధారాల నాశనం చేస్తారు: వైఎస్ జగన్

  • బినామీలకు చెక్కులు ఇస్తున్నారు
  • ఇది ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ మాత్రమే
  • సెక్రటేరియేట్ ను దుర్వినియోగం చేస్తున్నారు
  • గట్టి యాక్షన్ తీసుకోవాలని గవర్నర్ ను కోరిన జగన్  

"సెక్రటేరియేట్ లో చీఫ్ సెక్రటరీకి ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వండి. చంద్రబాబునాయుడు గారు, తాను చేసిన స్కామ్స్ మీద, తను అధికారం కోల్పోయిన తరువాత, ఆ ఆధారాలను మటుమాయం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు గారు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇది కాక, తనకు సంబంధించిన బినామీలకు, కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెక్కులు... వాళ్లకు మాత్రమే ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కంట్రోల్ చేయండి. ఇది ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ కాబట్టి, కొత్త ప్రభుత్వం వచ్చేదాకా చంద్రబాబునాయుడు సెక్రటేరియేట్ ను దుర్వినియోగం చేస్తూ, తన అన్యాయాలను కొనసాగించడం ధర్మం కాదు. అక్కడ కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాలని గవర్నర్ గారికి చెప్పడం జరిగింది" అని జగన్ అన్నారు.

ఈవీఎంలపై ఫిర్యాదులు చేస్తున్నది కేవలం చంద్రబాబు మాత్రమే తప్ప, ప్రజలు కాదని జగన్ వ్యాఖ్యానించారు. 80 శాతం మంది ఓటు వేసి, తాము ఎవరికి ఓటు వేశామో వీవీ ప్యాట్ లో చూసుకుని సంతృప్తి చెందారని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని, చంద్రబాబు మాత్రం తాను ఎవరికి ఓటు వేసిందీ తనకు తెలియడం లేదని సినిమా డ్రామాలు ఆడుతున్నారని, ఓ విలన్ మాదిరి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ ఏజంట్లతో మాక్ పోలింగ్ నిర్వహించినప్పుడు కూడా ఏ విధమైన ఫిర్యాదులూ లేవని అన్నారు. ఈవీఎంలలో లోపాలుంటే, దాదాపు 40 వేలకు పైగా ఉన్న పోలింగ్ బూత్ లలో ఉన్న టీడీపీ ఏజంట్లు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. 

More Telugu News