Chandrababu: నేడు తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం.. ఈవీఎంల అంశంపై మరో ప్రెస్ మీట్
- లోపాలను మీడియాకు వివరించనున్న ఏపీ సీఎం
- నేటి మధ్యాహ్నం స్టాలిన్ తో కలిసి మీడియా సమావేశం
- డీఎంకే పార్టీకి మద్దతుగా ప్రచారం
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మిత్ర ధర్మంలో భాగంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సోమవారం కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి తరఫున ప్రచారం చేసిన చంద్రబాబు ఇవాళ తమిళనాట రాజకీయ సభల్లో పాల్గొంటారు. డీఎంకే పార్టీకి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతుగా నిలవాలని చంద్రబాబు తమిళనాడులో ఉంటున్న తెలుగుప్రజలకు విజ్ఞప్తి చేస్తారు.
ఈ క్రమంలో నేటి మధ్యాహ్నం స్టాలిన్ తో కలిసి డీఎంకే కార్యాలయంలో సంయుక్తంగా మీడియా సమావేశానికి హాజరుకానున్నారు. ఇందులో ప్రధానంగా ఈవీఎంల లోపాలను విలేకరులకు వివరించే అవకాశాలున్నాయి.