Andhra Pradesh: బాబు ఎన్ని డ్రామాలాడినా జగన్ ను సీఎం కాకుండా ఆపలేరు: వైసీపీ నేత పార్థసారథి
- నాడు ఈవీఎంలలో లేని సమస్య ఇప్పుడెలా వచ్చింది?
- కాంగ్రెస్ కూడా ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేసింది!
- 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ తిరస్కరిస్తుందా?
చంద్రబాబు ఎన్ని డ్రామాలాడినా జగన్ ను సీఎం కాకుండా ఆపలేరని వైసీపీ నేత పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ వ్యతిరేకతతోనే పోలింగ్ శాతం పెరిగిందని, 2014లో ఈవీఎంలలో లేని సమస్య ఇప్పుడెలా వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల పోలింగ్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు సీఈసీని కలిసిన విషయాన్ని ప్రస్తావించారు.
ఈవీఎం చోరీ కేసు నిందితుడు హరిప్రసాద్ ను ఎలా పంపారు? ఈవీఎంలపై సందేహాలుంటే హరిప్రసాద్ బదులు వేరే వారిని పంపొచ్చు కదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంలపై అభ్యంతరం తెలిపితే, మొన్న జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను తిరస్కరిస్తారా? అని ప్రశ్నించిన ఆయన, తన ఓటమికి ఈవీఎంలే కారణమని చెప్పే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు.