: హైదరాబాద్ లో హోంటౌన్ మాల్ చీటింగ్
పంజాగుట్టలోని హోంటౌన్ షాపింగ్ మాల్ పై తూనికలు, కొలతల శాఖాధికారులు ఈ రోజు తనిఖీలు నిర్వహించారు. వస్తువులను ఎంఆర్పీ (కనీస చిల్లర ధర) కంటే అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో షాపులోని వస్తువులను స్వాధీనం చేసుకుని యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కాగా, పాంటూలూన్ తదితర మాళ్లను నిర్వహిస్తున్న ఫ్యూచర్ గ్రూపుకు చెందినదే ఈ హోమ్ టౌన్ బిగ్ బజార్!