Chandrababu: మీకు తొత్తులుగా వ్యవహరిస్తే అధికారులు బాగా పనిచేసినట్టా?: చంద్రబాబుపై జీవీఎల్ ఫైర్
- ఈసీ మీ జేబు సంస్థలా పనిచేయలేదని బాధపడుతున్నారా?
- రిటైర్డ్ ఐఏఎస్ ల అభియోగాలకు ఏంచెబుతారు?
- ఏపీలో చంద్రబాబు చేయడానికి ఏమీలేదు
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీకు తొత్తులుగా వ్యవహరిస్తే అధికారులు బాగా పనిచేసినట్టా? అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఈసీ మీ జేబు సంస్థగా పనిచేయలేదనే కదా మీ బాధంతా? అంటూ మండిపడ్డారు. రిటైర్డ్ ఐఏఎస్ లు చేసిన అభియోగాలకు మీ జవాబేంటి? అంటూ జీవీఎల్ నిలదీశారు. ఇక ఏపీలో చంద్రబాబు చేయడానికి ఇంకేమీ లేదని ఎద్దేవా చేశారు. జమ్మూకశ్మీర్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రచారానికి పిలుస్తారని, కానీ పార్టీ ఖర్చుతో వెళ్లండి అంటూ వ్యాఖ్యానించారు.