ntr: రాజమౌళి సినిమాలో చాలా గొప్ప పాత్ర నాది .. బాగా చేయగలననే నమ్మకం వుంది: అలియా భట్

  • 'మగధీర' సినిమా చూశాను 
  • రాజమౌళి గొప్ప దర్శకుడు
  •  నా పాత్రకి న్యాయం చేస్తాను  

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో అల్లూరి సీతారామరాజు మరదలు 'సీత' పాత్రలో అలియా భట్ కనిపించనుంది. భారీ పారితోషికాన్ని ఫిక్స్ చేసి మరీ ఈ పాత్ర కోసం ఆమెను తీసుకున్నారు.

తాజాగా ఈ సినిమాను గురించి అలియాభట్ మాట్లాడుతూ .. "రాజమౌళిగారి సినిమా అనగానే నేను ఒప్పుకోవడానికి కారణం 'బాహుబలి' .. అది సాధించిన విజయమని అనుకుంటారు. కానీ నేను ఈ సినిమాను అంగీకరించడానికి కారణం 'బాహుబలి' కాదు .. 'మగధీర'. ఈ సినిమా చూసిన దగ్గర నుంచే నాకు రాజమౌళి సినిమాలంటే ఇష్టం పెరిగింది. కథాకథనాలను జనరంజకంగా ఆవిష్కరించే గొప్ప దర్శకుడాయన. అలాంటి ఆయన దర్శకత్వంలో చేస్తున్నందుకు ఆనందంగా వుంది. ఈ సినిమాలో నా పాత్ర చాలా కష్టతరమైనది .. అయినా బాగా చేయడానికి ప్రయత్నిస్తాను"అంటూ చెప్పుకొచ్చింది. 

More Telugu News