Telugudesam: ఏపీ ప్రజలు చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టబోతున్నారు: సబ్బంహరి

- టీడీపీ గెలుపు, చంద్రబాబు వ్యక్తిగత విజయమే
- టీడీపీకి మహిళలు సంపూర్ణ మద్దతు ఇచ్చారు
- మళ్లీ అలాంటి రాజధాని నిర్మాణం బాబుతోనే సాధ్యం
ఏపీ ప్రజలు చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టబోతున్నారని టీడీపీ నేత సబ్బంహరి అభిప్రాయపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ గెలుపు, చంద్రబాబు వ్యక్తిగత విజయమే అవుతుందని అన్నారు. టీడీపీకి మహిళలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని, హైదరాబాద్ నిర్మాణంలో తెలుగు ప్రజల కృషి ఉందని, మళ్లీ అలాంటి రాజధాని కట్టాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు ఎంత కష్టమో తనకు తెలుసని, ఆ నిర్మాణాలను తాను చూసి వచ్చానని అన్నారు.