: టీఆర్ఎస్ శిబిరంలో ఘర్షణ
సూర్యాపేట టీఆర్ఎస్ శిక్షణా శిబిరంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ రగడ యావత్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సమక్షంలోనే జరిగింది. సూర్యాపేట నియోజకవర్గ ఇన్ ఛార్జిగా జగదీశ్వర్ రెడ్డిని వెంటనే పదవి నుంచి తొలగించాలంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆయనను పదవినుంచి తప్పించాలంటూ నినాదాలు చేసారు. దీంతో ఆగ్రహించిన జగదీశ్వర్ రెడ్డి వర్గీయులు జాగృతి కార్యకర్త రమేష్ పై దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతనిని ఆసుపత్రికి తరలించారు.