YSRCP: ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడిని అభినందిస్తున్నా: వైఎస్ జగన్
- ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతఙ్ఞతలు
- ఆటుపోట్లను తట్టుకుని నాయకులు నిలబడ్డారు
- టీడీపీ, చంద్రబాబు ఎంతో దారుణంగా వ్యవహరించారు
ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇంతటి ఆటుపోట్లను తట్టుకుని పార్టీ తరపున నిలబడ్డ ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని అభినందిస్తున్నానని అన్నారు. వైసీపీకి చెందిన కొంతమందికి గాయాలయ్యాయని, తమ పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కూడా పోయాయని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు.ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసి టీడీపీ, చంద్రబాబు ఎంతో దారుణంగా వ్యవహరించారని విమర్శించారు.