: కేసీఆర్ తో రాని తెలంగాణ కడియంతో వస్తదా?
తెలుగుదేశం పార్టీ నేత కడియం శ్రీహరి టీఆర్ఎస్ లో చేరనుండడంపై రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య భిన్నంగా స్పందించారు. ప్రత్యేకంగా పార్టీని స్థాపించి పోరాడుతున్నా కేసీఆర్ తో రాని తెలంగాణ రాష్ట్రం.. కడియం ఆ పార్టీలో చేరినంత మాత్రాన వస్తుందా? అంటూ ఆసక్తికరంగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ కు చెందిన కొందరు కార్యకర్తలు హన్మకొండలో పొన్నాల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా పొన్నాల పైవిధంగా మాట్లాడారు.