Andhra Pradesh: ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ నేతల ఫిర్యాదు

  • ఏపీలో టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు చేస్తోంది
  • ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
  • ఫిర్యాదులో ఆరోపించిన టీడీపీ నేతలు

ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ నేతల ఫిర్యాదు చేశారు. ఏపీలో పలు చోట్ల టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులు చేస్తోందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. హింసాత్మక ఘటనల జాబితాను ఈసీకి అందించిన టీడీపీ నేతలు, టీడీపీ వర్గీయులపై దాడులు చేస్తూ ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. కాగా, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు సహా పలు జిల్లాల్లో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. టీడీపీ కార్యకర్తలు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News