ysrcp: వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది: చంద్రబాబు
- ఓటమి భయంతో ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు
- టీడీపీ ఓటర్లను పోలింగ్ బూత్ లకు రాకుండా చేయాలనుకుంటున్నారు
- వైసీపీకి ఓటుతో బుద్ధి చెప్పండి
పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల్లో ఓటమి భయం పట్టుకుందని, అందుకే దాడులకు తెగబడుతూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఓటర్లను పోలింగ్ బూత్ లకు రాకుండా చేసి, తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు. ప్రజలెవరూ భయపడకూడదని... ఓటుతోనే వైసీపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత భాస్కరరెడ్డిని హత్య చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. హత్యారాజకీయాలను ప్రజలు నిరసించాలని... వైసీపీ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని చెప్పారు.