Chandrababu: మీ చేతుల్లో ఉన్నది ఓటు మహాస్త్రం... పోలింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సందేశం
- రేపు ఎన్నికలు
- ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగ విధిని నిర్వర్తించాలి
- ప్రజాస్వామ్యం పట్ల బాధ్యతను చాటుకోవాలి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఏప్రిల్ 11న జరిగే పోలింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. "రేపు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర పౌరులందరూ తమ రాజ్యాంగ విధిని తప్పకుండా నిర్వర్తించాలి. ప్రజాస్వామ్యం పట్ల తమ బాధ్యతను గుర్తెరిగి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి. ఏపీకి దివ్యమైన భవిష్యత్తును నిర్ణయించే ఓటు మహాస్త్రం మీ చేతుల్లోనే ఉంది. మీ హక్కును వినియోగించుకోండి" అంటూ ట్విట్టర్ లో పిలుపునిచ్చారు.
Tomorrow as Andhra Pradesh goes to polls, all the citizens must remember their constitutional duty and fulfill their responsibility towards democracy.
Exercise your right to vote as the power to ensure a glorious future for AP rests in your hands.