aadi saikumar: 'బుర్రకథ' నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్
- ఆది సాయికుమార్ హీరోగా 'బుర్రకథ'
- దర్శకుడిగా డైమండ్ రత్నబాబు
- నైరా షాకి ఇది తొలి సినిమా
తెలుగు తెరపై యువ కథానాయకులతో పోటీ పడటానికి ఆది సాయికుమార్ తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. కొంతకాలంగా సక్సెస్ అనేది పలకరించకపోవడంతో, ఆ సమయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రంగా 'బుర్రకథ' రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో ఆది సాయికుమార్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.
సినీ రచయితగా మంచి పేరు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు .. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో ఆది సాయికుమార్ జోడీగా మిస్తీ చక్రవర్తి నటిస్తోంది. తెలుగులో 'చిన్నదాన నీ కోసం' చిత్రం ద్వారా యూత్ కి ఆమె బాగా చేరువైంది. ఆ తరువాత ఆమె వరుస అవకాశాలను అందుకోలేకపోయింది. 'బుర్రకథ' తో టాలీవుడ్లో తాను బిజీ అవుతానని ఆమె భావిస్తోంది. ఇక మరో కథానాయికగా నైరా షా నటిస్తోంది .. తెలుగులో ఆమెకి ఇదే ఫస్టు సినిమా