Chandrababu: సీఎం చంద్రబాబు ఫిర్యాదుపై ఎన్నికల సంఘం వివరణ
- కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు పాటిస్తున్నాం
- మాపై ఎవరి ఒత్తిళ్లు లేవు
- నిష్పాక్షికంగా పనిచేస్తున్నాం
ఎన్నికల సంఘం పనితీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ద్వివేదీ వివరణ ఇచ్చారు. తాము ఎవరికీ కొమ్ము కాయట్లేదని, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నియమావళికి లోబడే తమకు సూచనలు చేస్తోంది తప్ప ఏ ఒక్క పార్టీకో సహకరించాలని ఆదేశించడంలేదని తెలిపారు. ఎన్నికల సంఘం అధికారులపై ఎవరి ఒత్తిళ్లు లేవని ద్వివేది పునరుద్ఘాటించారు. ఎన్నికల నిర్వహణలో తాము అన్ని పార్టీలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
అంతకుముందు చంద్రబాబు ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేదీని కలిసిన సందర్భంగా, వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ల ఆడియో టేపులు, భారతీరెడ్డి పీఏ అనితారెడ్డి ఆడియో టేపులకు సంబంధించిన పెన్ డ్రైవ్ ను అందజేశారు.