EC: ఈసీ కార్యాలయం దగ్గర చంద్రబాబు ధర్నా!
- ఎన్నికల కమిషన్ అక్రమాలు
- ఫిర్యాదు చేసినా స్పందించడం లేదన్న చంద్రబాబు
- సీఈఓకు స్వయంగా వినతిపత్రం ఇవ్వనున్న ఏపీ సీఎం
ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషన్ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చీఫ్ ఎలక్షన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగాలని నిర్ణయించారు. అధికారుల బదిలీ, ఐటీ దాడులపై తాము ఎన్నిసార్లు విన్నవించినా ఈసీ స్పందించడం లేదని పార్టీ నేతలు, మంత్రుల ఎదుట ఆరోపించిన చంద్రబాబు, సీఈఓకు స్వయంగా వినతి పత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈసీ వైఖరిపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈసీ కార్యాలయానికి వెళ్లి, అక్కడే ధర్నాకు దిగుదామని సూచించారు. చంద్రబాబు నిర్ణయానికి టీడీపీ నాయకులంతా మద్దతు పలికారు.