: ఆటో డ్రైవర్ నిజాయతీ.. 1.90కోట్లు వెనక్కి


అదృష్టం 1.90కోట్ల రూపాయల చెక్కు రూపంలో తలుపు తట్టింది. అయినా, ఆ అదృష్టం తనది కాదని తెలుసుకున్న అహ్మదాబాద్ ఆటో డ్రైవర్ రాజు భార్వాడ్ నిజాయతీగా వెనక్కి ఇచ్చేశాడు. రాజు భార్వాడ్ కుటుంబానికి సనంద్ లో 30 ఏళ్ల క్రితం 10 భిగాల భూమి ఉంది. అందులో కొంత రాజు తాతయ్య వేరే వాళ్లకు అమ్మేశాడు. కానీ, కొనుగోలు చేసిన వారు ప్రభుత్వ రికార్డులలో తమ పేర్లను నమోదు చేసుకోలేదు. దాంతో అది వీరి పేరు మీదే ఉంది. రాజు భార్వాడ్ కుటుంబం నుంచి కొనుగోలు చేసిన వారి భూమిని టాటా నానో ప్లాంట్ కోసం సేకరించింది. పరిహారంగా రికార్డులలో పేరున్న రాజా భార్వాడ్ కు 1.90కోట్ల రూపాయలను చెక్కు రూపంలో పంపింది. కానీ, ఆ భూమికి తాము యజమానులం కాదని, ఎప్పుడో విక్రయించేశామని రాజు భార్వాడ్ టాటా కంపెనీకి ఆ చెక్కును తిరిగిచ్చేశాడు.

  • Loading...

More Telugu News