Andhra Pradesh: వైసీపీ 20... టీడీపీ 5!... టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వేలో ఆసక్తికర అంశాలు

  • ఓటింగ్ శాతంలో తగ్గుదల ఉంటుందని అంచనా
  • ఏపీలో పోటీ అంతా టీడీపీ, వైసీపీ మధ్యే!
  • తెలంగాణలో టీఆర్ఎస్ కు 14 లోక్ సభ స్థానాలు

మరో రెండ్రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు, ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో, ముందస్తు అంచనాలు ఊపందుకున్నాయి. టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఈసారి వైసీపీకి అత్యధికంగా 20 లోక్ సభ స్థానాలు వస్తాయని, టీడీపీకి కేవలం 5 స్థానాలే దక్కుతాయని పేర్కొన్నారు.

ఏపీలో మొత్తం లోక్ సభ స్థానాలు 25 అన్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల్లో టీడీపీకి 15 సీట్లు దక్కగా, వైసీపీ 8 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 2 సీట్లు దక్కించుకుంది. ఈసారి మాత్రం బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని, పోటీ అంతా టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందని టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వే చెబుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ ఓటింగ్ శాతం 40.5 శాతం, ఈసారి అది 35.1 శాతం ఉండొచ్చని అంచనా వేశారు.

ఇక, తెలంగాణ విషయానికొస్తే సీఎం కేసీఆర్ 16 లోక్ సభ స్థానాలు అంటూ గట్టి నమ్మకం పెట్టుకున్నారు. అయితే, టైమ్స్ నౌ-వీఎంఆర్ సర్వేలో, కేసీఆర్ అంచనాకు రెండు స్థానాలు తక్కువగా టీఆర్ఎస్ పార్టీకి 14 లోక్ సభ స్థానాలు వస్తాయని అంచనా. కాంగ్రెస్ పార్టీకి 2, ఇతరులకు 1 లోక్ సభ స్థానం దక్కుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News