Dhanush: ధనుష్... భారత సైన్యంలో ప్రవేశించిన సరికొత్త అస్త్రం!

  • స్వదేశంలో తయారైన శతఘ్ని
  • మొత్తం 11 నమూనాల పరీక్ష
  • ప్రపంచంలో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యం ఛేదించే శతఘ్నిగా గుర్తింపు

ప్రధాని నరేంద్ర మోదీ గతకొంతకాలంగా మేకిన్ ఇండియా నినాదం చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాలతో పాటే రక్షణ రంగ ఉత్పత్తులను కూడా భారత్ లోనే తయారుచేయాలన్నది ఆయన సంకల్పం. అందుకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ధనుష్ శతఘ్నులు అన్ని పరీక్షలు అధిగమించి సైన్యంలో అడుగుపెట్టాయి. చాలాకాలంగా సైన్యంలో 155 ఎంఎం శతఘ్నుల కొరత వేధిస్తున్న నేపథ్యంలో స్వదేశీ తయారీ ధనుష్ ఓ ఆశాకిరణం అని చెప్పాలి. దీనికి సంబంధించి దాదాపు 11 మోడళ్లను భిన్న వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించి ఆమోద ముద్ర వేశారు. ఈ క్రమంలో నేటి నుంచి ధనుష్ అధికారికంగా భారత సైన్యంలో భాగమైంది.

ఈ శతఘ్నికి 38 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గురితప్పకుండా ఛేదించే సత్తా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కచ్చితత్వంలో లక్ష్యాన్ని ఛేదించే ఆర్టిలరీ గన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ఒక్కో ధనుష్ శతఘ్ని తయారీ ఖర్చు రూ.14.50 కోట్లు కాగా, దీన్లో ఉపయోగించే ఒక్కో షెల్ ఖరీదు లక్ష రూపాయల పైచిలుకే. రాత్రివేళల్లో సైతం దీంతో శత్రువులపై దాడి చేసే వీలుంటుంది.

More Telugu News