Tollywood: ​ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ కు పితృవియోగం

  • బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి కన్నుమూత
  • స్వగృహంలో తుదిశ్వాస విడిచిన శాస్త్రి
  • అనారోగ్యమే కారణం

ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్ కు పితృవియోగం కలిగింది. సాయిమాధవ్ తండ్రి బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. సుబ్రహ్మణ్యశాస్త్రి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం స్వగృహంలోనే కన్నుమూశారు. హైదరాబాద్ లోని మెహదీపట్నంలో నివాసం ఉంటున్న ఆయనకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో బుర్రా సాయిమాధవ్ పెద్ద కుమారుడు.

బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రికి నాటకరంగంలో విశేష పేరుప్రఖ్యాతులు ఉన్నాయి. ఆయనను అందరూ 'అభినవ చింతామణి' అని పేర్కొంటారు. అనేక నాటకాల్లో దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

  • Loading...

More Telugu News